ఇక పెట్రోల్‌ బంకుల్లోనూ...

17 Aug, 2017 10:48 IST|Sakshi
ఇక పెట్రోల్‌ బంకుల్లోనూ...

న్యూఢిల్లీః పెట్రోల్‌ బంకుల్లో జన్‌ ఔషధి మెడికల్‌ స్టోర్స్‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రాణ రక్షక ఔషధాలను చవక ధరలకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పెట్రోలియం, చమురు శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు.  పెట్రోల్‌ బంకుల్లో ఎల్‌ఈడీ బల్బుల విక్రయానికి ఆయిల్‌ రిటైలర్లతో ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో త్వరలో జనరిక్‌ దుకాణాలనూ అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

జనరిక్‌ స్టోర్స్‌ నిర్వహణకు క్వాలిఫైడ్‌ ఫార్మసిస్ట్‌ అవసరం ఉన్నందున ఫార్మసిస్ట్‌ల కొరతను అధిగమించి ఈ దుకాణాలను ముందుకు తీసుకువెళ్లడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు అధికారులు చెబుతున్నారు. పెట్రోల్‌ బంకుల్లో ఈ తరహా ఔట్‌లెట్లను అనుమతించడంతో యువతకు ఉపాధి అవకాశాలూ మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు