చంఢీఘడ్ బరిలో ఇద్దరు హీరోయిన్లు, ఒక విలన్!

16 Mar, 2014 13:33 IST|Sakshi
చంఢీఘడ్ బరిలో ఇద్దరు హీరోయిన్లు, ఒక విలన్!

చండీఘడ్ లోకసభ ఎన్నికల బరిలో ఈ సారి ఆసక్తికరమైన పోరు నెలకొంది. త్వరలోనే జరుగనున్న లోకసభ ఎన్నికల్లో చండీఘడ్ లోకసభ నియోజకవర్గంలో ఇద్దరు హీరోయిన్లు, ఒక విలన్ బరిలోకి దిగారు. బాలీవుడ్ తారలు గుల్ పనాగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీకి సిద్ధమవ్వగా, అనుపమ్ ఖేర్ సతీమణి కిరణ్ ఖేర్ భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

గుల్ పనాగ్, కిరణ్ ఖేర్ లను ఎదుర్కోనేందుకు ఈ స్థానం నుంచే నాలుగు సార్లు ఎంపికైన కేంద్రమంత్రి పవన్ కుమార్ భన్సల్ కాంగ్రెస్ తరపున పోటీలో నిలిచారు. రైల్వేశాఖలో ఉద్యోగాల కుంభకోణంలో 90 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ తన మేనల్లుడు పట్టుపడటంతో అప్పడు రైల్వేశాఖ మంత్రిగా ఉన్న పవన్ కుమార్ భన్సాల్ ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ నుంచి తప్పుకున్నారు. 

ప్రస్తుతం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న పవన్ కుమార్ భన్సాల్ కు గుల్ పనాగ్, కిరణ్ ఖేర్ నుంచి గట్టి పోటి ఎదురవుతోంది. అయితే ఈ స్థానం నుంచి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా స్థానిక మున్సిపల్ మహిళా కౌన్సిలర్ జన్నత్ జహన్ బరిలోకి దిగడం విశేషం. 1991, 1999, 2004, 2009 లోకసభలకు చండీఘడ్ లోకసభ స్థానం నుంచి గెలిచిన పవన్ కుమార్ భన్సాల్ ఈసారి ముగ్గురు మహిళల నుంచి గట్టిపోటి ఎదుర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు