చెన్నై, తిరువనంతపురం ఎయిర్ పోర్టుల్లో భారీగా బంగారం పట్టివేత 

12 Nov, 2023 16:19 IST|Sakshi

చెన్నై: చెన్నై, తిరువనంతపురం ఎయిర్‌పోర్టులలో అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనల్లో మొత్తం రూ.14 కోట్ల విలువగల బంగారాన్ని సీజ్ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు.

చెన్నై ఎయిర్‌పోర్టులో 8.49 కేజీల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ 4.55 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. 

తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో కూడా భారీ మొత్తంలో బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.  రూ. 9.11 కోట్ల విలువ చేసే 16.86 కేజీల గోల్డ్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సింగపూర్, మలేషియా, దుబాయ్, అబుదాబీ ప్రయాణికుల నుంచి బంగారాన్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో కస్టమ్స్ అధికారులు ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి: సైనికులతో మోదీ దీపావళి వేడుకలు

మరిన్ని వార్తలు