బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

29 May, 2017 10:25 IST|Sakshi

హైదరాబాద్: తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ అల్పపీడనం కోల్కతాకు దక్షిణ ఆగ్నేయ దిశగా సుమారు 800 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయ్యింది. ఈ తీవ్ర వాయుగుండం మరింత బలపడి, నేడు తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఉత్తర ఈశాన్య దిశగా పయనించి ఈనెల 30న బంగ్లాదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీంతో రుతుపవనాలు వేగంగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రానున్న 24గంటల్లో ఒడిషా,  పశ్చిమ బెంగాల్, కోస్తాంధ్రల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే అన్నిపోర్టుల్లో అధికారులు ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

మరిన్ని వార్తలు