రోడ్డెక్కిన రైతన్న

2 Jun, 2018 04:50 IST|Sakshi

10 రోజుల దేశవ్యాప్త ఆందోళనలు

భోపాల్‌ / మందసౌర్‌ / చండీగఢ్‌ / లక్నో: రైతులకు రుణమాఫీ, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల అమలుతో పాటు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ రైతు సంఘాలు శుక్రవారం దేశవ్యాప్తంగా 10 రోజుల ఆందోళనకు పిలుపునిచ్చాయి. ‘గావ్‌ బంద్‌’(గ్రామ బంద్‌) పేరిట చేపట్టిన ఈ ఆందోళనలో భాగంగా పట్టణాలు, నగరాలకు పాలు, కూరగాయాలు, పండ్లు, ఇతర నిత్యావసరాలను సరఫరా చేయరాదని నిర్ణయించాయి. పంజాబ్, హరియాణా, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కశ్మీర్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకల్లోని రైతు సంఘాలు హోల్‌సేల్, కూరగాయల మార్కెట్లను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. దీంతో పలు రాష్ట్రాల్లో రైతులు కూరగాయలు, పండ్లను రోడ్లపై పడేసి నిరసన తెలియజేశారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో  ‘గావ్‌ బంద్‌’ పేరిట శాంతియుత ఆందోళన చేపట్టినట్లు రాష్ట్రీయ కిసాన్‌ మజ్దూర్‌ మహాసంఘ్‌(ఆర్‌కేఎంఎం) కన్వీనర్‌ శివకుమార్‌ శర్మ తెలిపారు.

మరిన్ని వార్తలు