సరిహద్దులో ఉగ్ర దాడులు

28 Nov, 2014 01:33 IST|Sakshi
సరిహద్దులో ఉగ్ర దాడులు

ముగ్గురు ఆర్మీ సిబ్బంది, ముగ్గురు పౌరులు మృతి
నలుగురు ఉగ్రవాదులు హతం

 
జమ్మూ/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన మరోరోజు ఉండగా.. గురువారం జమ్మూలోని అర్నియా సెక్టార్‌లోని సరిహద్దు ప్రాంతం తుపాకుల మోతతో హోరెత్తింది. పాకిస్తాన్ సరిహద్దుకు చేరువలో ఉన్న రెండు భారత బంకర్లలపై ఉగ్రవాదులు దాడికి దిగారు. దీనిని ఆర్మీ సిబ్బంది దీటుగా ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన భీకరమైన కాల్పుల్లో ముగ్గురు ఆర్మీ సిబ్బందితో పాటు మరో ముగ్గురు పౌరులు మృతిచెందారు. భారీ ఎత్తున ఆయుధాలతో చొరబాట్లకు ప్రయత్నించి, ఒక బంకర్లో నక్కిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో మిలిటెంట్ బంకర్లోనే ఉన్నాడని, ఆ బంకర్‌ను పేల్చివేయడానికి ట్యాంకర్లను రప్పించామని పోలీసులు తెలిపారు. కాగా, శుక్రవారం ఉధంపూర్ జిల్లాలో జరిగే ఎన్నికల సభల్లో మోదీ పాల్గొననున్నారు. ఆ ప్రాంతం ఈ కాల్పులు జరి గిన ప్రాంతానికి 100 కి.మీ. దూరంలో ఉండటం గమనార్హం. ఐదుగురు ఉగ్రవాదుల బృందం అర్నియా సెక్టార్‌లోని ఎల్‌వోసీ నుంచి దేశంలో చొరబాటుకు ప్రయత్నించారని, ఆర్మీ, బీఎస్‌ఎఫ్, పోలీస్ దళాలు రంగంలోకి దిగి వారి కోసం వెతుకులాట ప్రారంభించిందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఆర్మీ దుస్తులు ధరించిన ఉగ్రవాదులు అర్నియా సెక్టార్‌లో తాము ఖాళీ చేసిన 92 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ బంకర్‌ను ఆక్రమించారన్నా రు. మిలిటెంట్లు ఉపయోగించనట్లుగా భావిస్తు న్న ఓ కారును ఆర్మీ స్వాధీనం చేసుకుంది.

యాదృచ్చికం కాదు..: ఒమర్

ఈ దాడులు యాదృచ్చికం కాదని, సార్క్ సమావేశాల్లో భారత్, పాక్ ప్రధానులు పాల్గొన్న నేపథ్యంలో ఈ కాల్పులు జరిగాయని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. కొన్నింటిని ఎప్పటికీ మార్చలేమని, ఇరు దేశాల నేతలు సమావేశమైతే సరిహద్దులో అలజడి మామూలేనని చెప్పారు. మరోవైపు రాజౌరీ జిల్లాలోని ఎల్‌వోసీ వద్ద చొరబాటుకు మిలిటెంట్లు చేసిన ప్రయత్నాన్ని ఆర్మీ అడ్డుకుంది. ఆయుధాలతో కూడిన ఒక అనుమానిత మిలిటెంట్‌ను అదుపులోనికి తీసుకుంది.
 
400లకుపైగా ఉల్లంఘనలు


న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఆగస్టు నుంచి సెప్టెంబర్ 17 వరకూ పాకిస్తాన్ సేనలు 400ల సార్లకుపైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు గురువారం రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశ ప్రజల రక్షణ, భద్రత కల్పించేం దుకు, దేశ సమగ్రతను కాపాడేందుకు కేం ద్రం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.
 
 

>
మరిన్ని వార్తలు