Narendra Modi: బానిస మనస్తత్వం నుంచి విముక్తి

19 Dec, 2023 04:52 IST|Sakshi
స్వర్‌వేద్‌ మహామందిర్‌ లోపలి భాగాన్ని పరిశీలిస్తున్న మోదీ, యోగి

ఎర్రకోట పైనుంచి విముక్తిని ప్రకటించుకుంది 

ఘనమైన సాంస్కృతిక వారసత్వం పట్ల భారత్‌ గరి్వస్తోంది

శరవేగంగా రామ్‌ సర్క్యూట్‌ అభివృద్ధి పనులు: మోదీ 

వారణాసిలో స్వర్‌వేద్‌ మహామందిర్‌ ప్రారంభం  

వారణాసి: బానిస మనస్తత్వం నుంచి భారత్‌ విముక్తిని ప్రకటించుకుందని, ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని గర్వకారణంగా భావిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బానిసత్వంలో మగ్గుతున్న సమయంలో కుట్రదారులు మన దేశాన్ని బలహీనపర్చేందుకు ప్రయతి్నంచారని, మన సాంస్కృతిక చిహా్నలను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. ఈ చిహా్నలను పునర్‌నిర్మించుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం స్వర్‌వేద్‌ మహామందిర్‌ను ప్రధాని మోదీ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత సోమనాథ్‌ ఆలయ పునర్‌నిర్మాణాన్ని కొందరు వ్యతిరేకించారని చెప్పారు. ఇలాంటి ఆలోచనా విధానం కొన్ని దశాబ్దాల పాటు కొనసాగిందన్నారు.

దీనివల్ల దేశం ఆత్మన్యూనత భావంలోకి జారిపోయిందని, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం పట్ల గరి్వంచడం కూడా మర్చిపోయిందని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చాక ఏడు దశాబ్దాల తర్వాత కాలచక్రం మరోసారి తిరగబడిందని, బానిస మనస్తత్వం నుంచి విముక్తిని ఎర్రకోటపై నుంచి భారత్‌ ప్రకటించుకుందని స్పష్టం చేశారు. సోమనాథ్‌ నుంచి ప్రారంభించిన కార్యాచరణ ఇప్పుడొక ఉద్యమంగా మారిందని తెలిపారు.

కాశీ విశ్వనాథ్‌ కారిడార్, కేదార్‌నాథ్, మహాకాళ్‌ మహాలోక్‌ క్షేత్రాల అభివృద్ధే అందుకు నిదర్శనమని వివరించారు.  బుద్ధా సర్క్యూట్‌ను గొప్పగా అభివృద్ధి చేశామని, బుద్ధుడు ధ్యానం చేసుకున్న క్షేత్రాలు ప్రపంచ పర్యాటకులను ఆకర్శిస్తున్నాయని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. రామ్‌ సర్క్యూట్‌ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మరికొన్ని వారాల్లో అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు.

‘వికసిత్‌’లో పాల్గొనండి...
మౌలిక సదుపాయాల లేమి మన ఆధ్యాతి్మక యాత్రకు పెద్ద అవరోధంగా మారుతోందని, ఆ పరిస్థితిని మార్చేస్తున్నామని మోదీ వివరించారు. వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్రపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఆధ్యాతి్మక గురువులు, మత పెద్దలు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏడంతస్తుల స్వర్‌వేద్‌ మహామందిర్‌ కేంద్రంలో ఏకకాలంలో 20,000 మంది ధ్యానం చేసుకోవచ్చు. స్వరవేద శ్లోకాలను ఇక్కడి గోడలపై అందంగా చెక్కారు.  

నాలుగు కులాల సాధికారతే లక్ష్యం
యువత, పేదలు, రైతులు, మహిళలనే నాలుగు కులాలు సంపూర్ణ సాధికారత సాధించాలన్నదే తన లక్ష్యమని మోదీ అన్నారు. సోమవారం వారణాసిలో ఆయన వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం రూ.19,000 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.

దేశ ప్రజలకు మోదీ 9 వినతులు  
1. ప్రతి నీటి బొట్టును ఆదా చేయండి. జల సంరక్షణ విషయంలో ప్రజలను చైతన్యవంతులుగా మార్చండి  
2.     గ్రామాలకు వెళ్లండి. డిజిటల్‌ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన పెంచండి.
3. పరిశుభ్రతలో మీ ప్రాంతాన్ని నంబర్‌ వన్‌గా మార్చడానికి కృషి చేయండి.   
4. స్థానికంగా తయారైన ఉత్పత్తులను ప్రోత్సహించండి.
5. ఎంత ఎక్కువ వీలైతే అంతగా సొంత ఊరును సందర్శించండి. దేశమంతటా తిరగండి. మన దేశంలోనే పెళ్లిళ్లు చేసుకోండి.  
6. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసేలా రైతులను ప్రోత్సహించండి.
7. నిత్యం తీసుకొనే ఆహారంలో తృణధాన్యాలను ఒక భాగంగా మార్చుకోండి.
8. జీవితంలో ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వండి.
9. కనీసం ఒక పేద కుటుంబానికి అండగా నిలవండి. 

>
మరిన్ని వార్తలు