భోపాల్లో స్క్రాప్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం

24 Oct, 2016 09:42 IST|Sakshi
భోపాల్లో స్క్రాప్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భోపాల్లోని ఓ ప్లాస్టిక్‌ స్క్రాప్‌ గోడౌన్‌లో తెల్లవారుజాము 2.30 గంటల సమయంలో ఈ మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్తా పక్కనున్న 4 ఫ్యాక్టరీలకు వ్యాపించాయి. ఘటనా స్థలంలో దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ఫ్యాక్టరీ నుంచి పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.

సమాచారం అందుకున్న  అగ్నిమాపక సిబ్బంది 35 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రమాదం జరిగిన ప్రదేశంలో నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలచిపోయింది. ఈ నేపథ్యంలో మంటలను ఆర్పేందుకు కూడా నీళ్లు లేక... ఫైర్‌ సిబ్బంది వచ్చే వరకూ స్థానికులు చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఫలితంగా గోడౌన్‌లో మొదలైన మంటలు క్రమంగా ఫ్యాక్టరీలకు వ్యాపించాయి. ఇవన్నీ ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ తయారయ్యే కర్మాగారాలే. ఘటనలో పెద్దమొత్తంలో ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు