వరదల్లో లక్షల మంది

16 Jul, 2016 12:16 IST|Sakshi
వరదల్లో లక్షల మంది

గువాహటి: ఎడతెరిపి లేకుండా ఉత్తరాదిన కురుస్తున్న వర్షాల కారణంగా పోటెత్తుతున్న వరదలు అసోంను ముంచెత్తుతున్నాయి. దాదాపు 1.75లక్షల మంది ప్రజలు ఈ వరదల భారిన పడ్డారు. మొత్తం ఆరు జిల్లాల్లో ఈ వరద ప్రవాహం ఉందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం లఖీంపూర్, గోలఘాట్, మోరిగావ్, జోరట్, ధెమాజి, బిస్వాంత్ జిల్లాల్లోని 244 గ్రామాలు వరద ముంపులో పడ్డాయని చెప్పారు. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థితిని దాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అధికారులు పదుల సంఖ్యలో పదుల సంఖ్యలో క్యాంపులు ఏర్పాటుచేసి సేవలు అందిస్తున్నారు. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు