రూ. 30 వేల వరకు చికిత్స ఫ్రీ!

13 Jul, 2014 02:56 IST|Sakshi

జాతీయ రహదారులపై ప్రమాద బాధితులకు సాయం..
ప్రస్తుతం గుర్గావ్-జైపూర్ మార్గంలో అమలు..
త్వరలో రెండు మార్గాల్లో.. ఆపై దేశమంతటా!

 
న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల బాధితులకు రూ.30 వేల వరకు ఉచిత చికిత్స అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని దశలవారీగా దేశమంతా అమలు చేయాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 226 కిలోమీటర్ల గుర్గావ్-జైపూర్ జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాలకు అమలు చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రమాద బాధితులకు రూ.30,000 వరకు చికిత్స ఖర్చు తాము భరిస్తున్నామని, దానికి పైన అయ్యే ఖర్చు బాధితులు లేదా వారి బంధువులే భరించాలని రహదారి శాఖ కార్యదర్శి విజయ్ చిబ్బర్ తెలిపారు.

ఇప్పుడు దాన్ని ముంబై-బరోడా, రాంచీ-జంషెడ్‌పూర్ రహదారులపై కూడా అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆయన శనివారమిక్కడ  ఓ సదస్సులో మాట్లాడారు. ఈ పైలట్ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.20 కోట్లను కేటాయించిందన్నారు. త్వరలో ఏడాదికి రూ.500 నుంచి 600 కోట్లు కేటాయించి ఈ ప్రాజెక్టును దేశమంతా అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు వివరించారు.
 

మరిన్ని వార్తలు