‘నరోడా’ కేసులో కొడ్నానీ నిర్దోషి

21 Apr, 2018 02:35 IST|Sakshi
మాయా కొడ్నానీ

అహ్మదాబాద్‌: నరోడా పటియా అల్లర్ల కేసులో నిందితురాలిగా ఉన్న బీజేపీ మాజీ మంత్రి మాయా కొడ్నానీని శుక్రవారం గుజరాత్‌ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులో బజరంగ్‌దళ్‌ మాజీ నేత బాబూ భజరంగీని దోషిగా తేల్చింది. 2002లో గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన నరోడా అల్లర్లలో 97 మంది మృతి చెందారు.

కొడ్నానీ నేరం చేసినట్లు ఎలాంటి ఆధారాలను ప్రాసిక్యూషన్‌ సమర్పించలేకపోయిందని కోర్టు పేర్కొంది. కాగా, భజరంగీని దోషిగా తేలుస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. అల్లర్లకు భజరంగీ కుట్ర పన్నినట్లు నిరూపి తమైందని కోర్టు పేర్కొంది.  భజరంగీకి హైకోర్టు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ట్రయల్‌ కోర్టు దోషులుగా తేల్చిన 32 మందిలో 13 మందిని హైకోర్టు దోషులుగా నిర్ధారించింది.

మరిన్ని వార్తలు