కేజ్రీవాల్‌కు ఏదో జరగబోతోంది

11 Nov, 2023 06:20 IST|Sakshi

ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ ఆందోళన

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఇరుకున పెట్టేందుకు పెద్ద కుట్ర జరగబోతోందని ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ అనుమానం వ్యక్తం చేశారు. మనీ ల్యాండరింగ్‌ కేసులో శుక్రవారం రౌస్‌ అవెన్యూ కోర్టుకు హాజరైన అనంతరం కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘కేజ్రీవాల్‌ను ఇరికించేందుకు కుట్ర జరుగుతోంది. ఆయన్ను అరెస్ట్‌ చేయడం మాత్రమే కాదు.

అంతకంటే మించి ఏదో చేయడమే ఆ కుట్ర’ అని అన్నారు. మద్యం విధానం కేసులో మనీ ల్యాండరింగ్‌ ఆరోపణలపై విచారణకు రావాలంటూ ఈడీ పంపిన సమన్లకు కేజ్రీవాల్‌ స్పందించని విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్‌ జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది.

మరిన్ని వార్తలు