తమిళనాడు తీరప్రాంతంలో భారీ వర్షాలు

17 May, 2016 14:20 IST|Sakshi

చెన్నై: తమిళనాడు తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు మంగళవారం వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. చెన్నైకి 240 కిలోమీటర్ల దూరంలో అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమైంది. దాంతో రానున్న 48 గంటల్లో అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

దీన్ని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో చెన్నై, తిరువళ్లుర్, క్రాంతిపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. చిత్తూరు, నెల్లూరులో కూడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మరిన్ని వార్తలు