ప్రైవేట్‌ లాకర్లలో కోట్లాది రూపాయలు

4 Dec, 2018 08:57 IST|Sakshi
లాకర్ల నుంచి వెలికితీసిన డబ్బును లెక్కిస్తున్న దృశ్యం (ఏఎన్‌ఐ ఫొటో)

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని చాందినీ చౌక్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థ నిర్వహిస్తున్న లాకర్లలో భారీగా సొత్తు బయటపడింది. ఖారి బౌలి, చాందినీ చౌక్, నయా బజార్‌ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఈ సంస్థకు చెందిన 350 లాకర్లలో డబ్బు, నగలు దాస్తుంటారు. అయితే, వ్యాపారులు పన్నులు ఎగవేసేందుకు లెక్కల్లో చూపని ఆదాయాన్ని ఇక్కడున్న సుమారు 100 లాకర్లలో దాచి ఉంటారని ఆదాయ పన్ను శాఖ(ఐటీ) అధికారులు అనుమానిస్తున్నారు.

39 లాకర్లను తెరిచి చూడగా రూ. 30 కోట్ల నగదు బయటపడిందని, దీన్ని స్వాధీనం చేసుకున్నామని సోమవారం అధికారులు తెలిపారు. మిగతా లాకర్లను కూడా తనిఖీ చేస్తామన్నారు. అయితే, ఎలాంటి అక్రమాలు, అనధికార లావాదేవీలకు పాల్పడలేదని, తమ సంస్థకు 1992లోనే ఆర్‌బీఐ అనుమతి లభించిందని ఆ సంస్థ నిర్వాహకుడు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు