మహాభారతంలో ఇంటర్నెట్‌ ఉంది : సీఎం

18 Apr, 2018 09:46 IST|Sakshi
త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌

అగర్తలా, త్రిపుర : భారతీయ జనతా పార్టీ మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ వ్యాఖ్యలను మరువక ముందే ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అగర్తలాలోని ఓ ఈవెంట్‌కు హాజరైన  మహాభారత కాలంలోనే ఇంటర్నెట్‌, ఉపగ్రహ వ్యవస్థ భారత్‌కు అందుబాటులో ఉన్నాయని అన్నారు.

మహాభారత సంగ్రామంలో ఎప్పటికప్పుడు ఏం జరగుతుందో సంజయ ద్రుతరాష్ట్రుడి తెలియజేశాడని, అది ఇంటర్నెట్‌ వల్లే సాధ్యం అయిందని చెప్పారు. అయితే, ఈ టెక్నాలజీ అప్పట్లోనే ఉందని మనకు తెలియలేదని అన్నారు. ఇంటర్నెట్‌ను పాశ్చాత్య దేశాలు కనుగొన్నాయని భావించే ప్రతిఒక్కరూ లక్షల సంవత్సరాల క్రితమే భారత్‌ ఇంటర్నెట్‌ను వినియోగించిందని తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు.

సాంకేతికతకు పుట్టినిల్లు అయిన భారత్‌లో జన్మించినందుకు తనకు గర్వంగా ఉందన్నారు. ఇంటర్నెట్‌ వంటి అద్భుత సాంకేతికతను దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అందరికీ అందుబాటులోకి తెస్తున్నారని అన్నారు. కాగా, విప్లవ్‌ వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో జోకులు పేలుతున్నాయి.

బీజేపీలో ఉంటూ కెరీర్‌ను అభివృద్ధి పథాన నడిపించుకోవాలంటే స్టూపిడ్‌ కామెంట్స్‌ చేయాలని ఒకరు. అవునా..!! అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, కొందరు నిపుణులు విప్లవ్‌ కామెంట్లపై ప్రశ్నలు సంధించారు. మీరు చెప్పిందే నిజమైతే పద్మవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడు ఎలా వెనక్కురావాలో క్వొరాలో అడగలేదు ఎందుకు? అని ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం సత్యపాల్‌ డార్విన్‌ సిద్ధాంతాన్ని తప్పుబట్టిన విషయం తెలిసందే.

మరిన్ని వార్తలు