ఆస్పత్రిలో చేరిన ఇంద్రాణి

7 Apr, 2018 10:17 IST|Sakshi
షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా (ఫైల్‌ ఫొటో)

ముంబై : షీనా బోరా హత్య కేసులో బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం రాత్రి ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో ఆమెను జేజే ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అధిక మోతాదులో మందులు తీసుకున్న కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు అనుమానిస్తున్నారు. అయితే, జైలు అధికారులుగానీ, ఆస్పత్రి వర్గాలుగానీ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. గతంలో కూడా అధిక మోతాదులో మందులు తీసుకున్న కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్‌ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణీ డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి షీనా బోరా హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణీని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరా హత్య కుట్రలో సవతి తండ్రి పీటర్‌ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు