ఇరోం షర్మిల నిర్దోషి

6 Oct, 2016 08:20 IST|Sakshi
ఇరోం షర్మిల నిర్దోషి
ఇంపాల్: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల(44)ను నిర్దోషిగా పరిగణిస్తూ మణిపూర్ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఆమె మణిపూర్లో సైనిక చట్టాలకు వ్యతిరేకంగా 16 ఏళ్లు నిరశన దీక్షను కొనసాగించారు. ఆమెపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్మాయత్నం కేసును నమోదు చేశారు.  దీంతో రాజకీయ పార్టీ స్థాపనకు తనకు మార్గం సుగమం అయిందని బుధవారం కోర్టుకు హాజరైన షర్మిల పేర్కొన్నారు.  ఈనెలలో రాజకీయపార్టీ ఏర్పాటు చేస్తానని ఆమె ప్రకటించారు.   

రానున్న ఏడాది మణిపూర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని, సీఎం కావాలనే తన మనసులోని మాటను గతంలోనే షర్మిల బయటపెట్టారు. మణిపూర్లో సైనిక చట్టాలకు వ్యతిరేకంగా 2000 సంవత్సరంలో షర్మిల ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.  ఈ యేడాది అగష్టు 9 దీక్షను విరమించారు. 
మరిన్ని వార్తలు