జయపై పదేళ్లపాటు అనర్హత

13 Nov, 2014 04:34 IST|Sakshi
జయపై పదేళ్లపాటు అనర్హత

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రత్యేక సీబీఐ కోర్టు ఆమెను దోషిగా తేల్చిన నేపథ్యంలో ఆమెపై అనర్హత వేటు కోర్టు తీర్పు వెలువరించిన 27 సెప్టెంబర్ 2014 నుంచి అమలులోకి వచ్చినట్టు పేర్కొంది.
 
 ఈ గెజిట్ నోటిఫికేషన్‌ను తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పి.ధనపాల్ విడుదల చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 ప్రకారం అనర్హత వేటు పడినట్టు పేర్కొంది. అలాగే జయకు జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం శ్రీరంగం సెప్టెంబర్ 27 నుంచి ఖాళీగా ఉన్నట్టు పేర్కొంది. 18 ఏళ్ల క్రితం నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు కోర్టు జయలలితను దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు