వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌: 51 టెంకాయలు ఆర్డర్‌.. ‘ఎక్స్‌’ పోస్ట్‌ వైరల్‌!

19 Nov, 2023 20:04 IST|Sakshi

అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. భారత్‌ విజయం కోసం కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆతృతంగా ఎదురు చూశారు.. అన్ని  వర్గాల వారు ఆకాంక్షించారు.. ప్రార్థనలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి వరల్డ్‌ కప్‌ కైవసం చేసుకుంది.

అయితే మ్యాచ్‌ ప్రారంభానికి ముందు వరల్డ్‌ కప్‌లో భారత్‌ విజయం సాధించి కప్‌ గెలిస్తే కొట్టడానికి 51 టెంకాయలను థానేకు చెందిన ఓ వ్యక్తి ఫుడ్‌డెలివరీ యాప్‌ స్విగ్గీలో ఆర్డర్‌ చేశారు. ఈ సమాచారాన్ని స్విగ్గీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ద్వారా తెలియజేసింది. థానే నుంచి ఎవరో ఇప్పుడే 51 టెంకాయలు ఆర్డర్‌ చేశారు. బహుశా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ గెలుపు కోసమే అయిఉండచ్చు. అదే నిజమై భారత్‌కు కప్‌ రావాలని ఆకాంక్షించింది.

కాగా స్విగ్గీ పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే ఈ ఆర్డర్‌ చేసింది తానే అంటూ ఓ వ్యక్తి స్విగ్గీ పోస్ట్‌ను రీట్వీట్‌ చేశారు. భారత్‌ వరల్డ​్‌ కప్‌ గెలిస్తే కొట్టడానికే టెంకాయలు ఆర్డర్‌ చేసినట్లు పేర్కొన్నారు. టీవీ ముందు టెంకాయలు ఉంచిన దృశ్యాన్ని ఈ ట్వీట్‌కు జత చేశారు. ఈ ట్వీట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ మారాయి. లక్షల్లో వ్యూవ్స్‌, కామెంట్లు వచ్చాయి. కాగా ఇదే వ్యక్తి భారత్‌ విజయాన్ని వ్యక్తీకరించడానికి 240 అగరబత్తులను ఆర్డర్ చేశారు.

మరిన్ని వార్తలు