ఆ ఉద్యోగులకు మాత్రమే ఆప్షన్లు

25 Jul, 2014 13:47 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర క్యాడర్ ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలపై ఎట్టకేలకు సందిగ్ధం తొలగింది. ఉద్యోగుల పంపిణీపై కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఒకటి, రెండు రోజుల్లో  విధివిధానాలను వెబ్సైట్లో పొందుపరచనున్నారు. వీటిపై తమ అభ్యంతరాలు తెలిపేందుకు ఉద్యోగులకు కమిటీ పది రోజుల గడువు ఇచ్చింది.

ఇక భార్యాభర్తలకు, వివాహం కానివారికి, వితంతువులకు మాత్రమే ఆప్షన్లు ఉంటాయి. స్థానికత ఆధారంగా ఉద్యోగుల పంపిణీ చేయనున్నారు. ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న వారికి ఆప్షన్ అవకాశం ఇవ్వలేదు. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత పంపకాలు చేయనున్నారు. ఉద్యోగుల పంపీణిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు శుక్రవారం కమలనాథన్ కమిటీతో భేటీ అయ్యారు.

 

మరిన్ని వార్తలు