నకిలీ హెలికాప్టర్ టికెట్లతో మోసం

26 May, 2016 07:39 IST|Sakshi

హైదరాబాద్‌: కేదార్‌నాథ్‌ యాత్ర కోసం వెళ్లిన తెలుగు యాత్రికులు ఇక్కట్లు పడుతున్నారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతంలోని బాబూరావు వీధికి చెందిన 54 కుటుంబాలు కేదార్‌నాథ్ వెళ్లగా తమిళనాడుకు చెందిన ట్రావెల్‌ ఏజెంట్‌ చేతిలో మోసపోయారు. అక్కడ తమిళనాడుకు చెందిన ఓ ఏజెంట్‌.. యాత్రికులకు నకిలీ హెలికాప్టర్‌ టికెట్లను అంటగట్టాడు. హెలికాప్టర్‌లో వెళ్లేందుకు బాధితులు ఒక్కొక్కరు ఏజెంట్‌కు రూ. 8,300 చెల్లించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి 130 మంది యాత్రికులు కేదార్‌నాథ్‌కు వెళ్లారు.

అయితే ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 50 వేలు వరకు వసూలు చేసినట్టు బాధితులు వాపోయారు. ప్రస్తుతం ఉత్తరఖండ్‌లోని పట్టా, గుప్తకాశి, రుద్రప్రయాగ జిల్లాల్లో బాధితులు ఉన్నట్టు తెలిసింది. మొత్తం 135 మంది బాధితులు ప్రభుత్వ సాయం చేయాలని కోరుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా నుంచి 52 మంది, విజయవాడ నుంచి 54 మంది, వేరే ప్రాంతాల నుంచి మరో 35 మంది కేదార్‌నాథ్‌ వెళ్లిన యాత్రికులు ఉన్నారు. రుద్రప్రయాగలోని పోలీసు స్టేషన్ ఎదుట ఈ యాత్రికులంతా నిరసనకు దిగారు.

మరిన్ని వార్తలు