నేటి విశేషాలు...

12 Nov, 2019 08:46 IST|Sakshi

శివసేనకు భంగపాటు తప్పలేదు. మద్దతు లేఖ ఇవ్వకుండా కాంగ్రెస్‌ ఆఖరి నిమిషంలో శివసేనకు ట్విస్ట్‌ ఇచ్చింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటు రేసులో ఎన్సీపీ ముందుకు వచ్చింది. ఎన్సీపీని గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. స్పందించేందుకు 24 గంటల గడువు విధించి, నేటి(మంగళవారం) రాత్రి 8.30 వరకు ఏ విషయం చెప్పాలన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేడు బ్రెజిల్‌ వెళ్లనున్నారు. అక్కడ జరిగే బ్రిక్స్‌ దేశాల సదస్సులో ఆయన పాల్గొంటారు. రష్యా, చైనా అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 39వ రోజుకు చేరింది. ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించలేమని, అది తమ పరిధిలోని వ్యవహారం కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. తదుపరి విచారణ నేడు జరుగనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎస్సీ నర్సింగ్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (ఎంపీటీ) కోర్సుల్లో అడ్మిషన్లకు ఈనెల 12 న మధ్యాహ్నం 3 గంటల నుంచి 14 న మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ జరుగనుంది. దివ్యాంగ అభ్యర్థులు కూడా ఇదే తేదీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.

భాగ్య నగరంలో నేడు..
గురు నానక్‌ దేవ్‌ జీ ఫొటో ఎగ్జిబిషన్‌ _వేదిక : ఎగ్జిబిషన్‌ గ్రౌండ్, నాంపల్లి 
_సమయం : ఉదయం 11 గంటలకు. 

శ్రీ చక్ర దీపోత్సవం _వేదిక: ఎల్‌బీ స్టేడియం 
_సమయం: రాత్రి 9 గంటలకు. 

తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి _వేదిక: శ్రీ త్యాగరాజ గాన సభ 
_సమయం: సాయంత్రం 4 గంటలకు. 

వాలీబాల్, బాస్కెట్‌ బాల్‌ సెలక్షన్స్‌ _వేదిక : కాలేజీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సోషల్‌ సైన్స్‌(టూరిస్ట్‌ స్పాట్‌), ఉస్మానియా వర్శిటీ. 
_సమయం : ఉదయం 9 గంటలకు. 

డిజిటల్‌ వరల్డ్‌ ఆఫ్‌ గ్లోబల్‌ పోలీసింగ్‌ సమ్మిట్‌ _వేదిక : హైటెక్స్‌ 
_సమయం : ఉదయం 9 గంటలకు 

తెలంగాణ నృత్యోత్సవం _వేదిక : రవీంద్ర భారతి 
_సమయం : సాయంత్రం 6 గంటలకు 

ఆది ధ్వని.. ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ ట్రైబల్‌ అండ్‌ ప్లోక్‌ మ్యూజిక్‌ ఇని్రస్టిమెంట్స్‌ _వేదిక:తెలంగాణస్టేట్‌గ్యాలరీఆఫ్‌ఫైన్‌ఆర్ట్స్‌ 
_సమయం : ఉదయం 10.30 గంటలకు  

ఆల్‌ ఇండియా చెస్‌ టోర్నమెంట్‌ _వేదిక : లక్ష్మి గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌ 
_సమయం : ఉదయం 8 గంటలకు 

మాయ.. ది మిత్‌.. ఎగ్‌ టెంపెరా పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ _వేదిక : అలయన్స్‌ ఫ్రాంఛైస్‌ 
సమయం : ఉదయం 10.30 గంటలకు. 

ఆర్ట్‌ ఆజ్‌ ఎవ్రీవేర్‌.. ఆర్ట్‌ కాంపిటీషన్‌ _వేదిక చి్రల్డన్స్‌ ఫైన్‌ ఆర్ట్‌ గ్యాలరీ 
_సమయం : ఉదయం 10.30 గంటలకు. 

అంతర్జాతీయ మొక్కల రక్షణ కాంగ్రెస్‌ _వేదిక : హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌(హెచ్‌ఐసీసీ) 
_సమయం : ఉదయం 9 గంటలకు.  

మరిన్ని వార్తలు