రేయ్‌.. నేను సుప్రియను మోసం చేశా!

22 Feb, 2018 08:50 IST|Sakshi
ఐశ్వర్య శర్మ.. పక్కన ఆమె చేసిన పోస్టు

సాక్షి, ముంబై : ‘సుప్రియా.. నీ బాయ్‌ ఫ్రెండ్‌తో జాగ్రత్త!’... ఈ పోస్టు గత వారం రోజులుగా ముంబై నగరంలో చక్కర్లు కొడుతోంది. తన గర్ల్‌ ఫ్రెండ్‌ను మోసం చేసి వేరే అమ్మాయితో అఫైర్‌ కొనసాగిస్తున్న ఓ వ్యక్తి బండారాన్ని బయటపెడుతూ ఓ యువతి చేసిన పోస్టు ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 

అంధేరీకి చెందిన ఐశ్వర్య శర్మ వారం రోజుల క్రితం ఓ పబ్‌కు వెళ్లింది. అక్కడ ఇద్దరు యువకులు ఆమె వెనకాలే కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఓ యువకుడు ‘అరేయ్‌.. నేను సుప్రియను బోల్తా కొట్టించి.. నిధితో నిన్న రాత్రి బయటకు వెళ్లి ఎంజాయ్‌ చేశాను’ అని చెప్పాడు. దానికి మరో యువకుడు ‘సూపర్‌ రా...సుప్రియ ఆ విషయాన్ని కనిపెట్టలేదు’ అంటూ అన్నాడు. అయితే అది విన్న ఐశ్వర్య మాత్రం సుప్రియ నిన్ను కనిపెడుతుంది అంటూ ఓ పోస్ట్‌ చేసింది. 

‘సుప్రియా. నీ ప్రియుడి పేరు అమన్‌. వాడు నిన్ను మోసం చేసి నిధితో కులుకుతున్నాడు. వాడో వెధవ (బూతులు కూడా...). నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. సుప్రియా పేరుతో ఉన్న అమ్మాయిలందరికీ విజ్ఞప్తి. మీ బాయ్‌ప్రెండ్‌లలో ఎవడైనా అమన్‌ పేరుతో ఉంటే... వెంటనే వాడితో బ్రేకప్‌ చెప్పేయండి’ అంటూ సూచించింది. ముంబైలో మీకు తెలిసిన సుప్రియలందరికీ ఈ సందేశాన్ని షేర్‌ చెయ్యండంటూ ఐశ్వర్య కోరింది. అప్పటి నుంచి సేవ్‌ సుప్రియ పేరిట యాష్‌ ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

ఇంతకీ ఆ సుప్రియ ఆచూకీ దొరికిందో లేదో తెలీటం లేదుగానీ.. పబ్లిసిటీ కోసమే ఐశ్వర్య ఈ పోస్టు చేసిందని అనుమానం వ్యక్తం చేసేవాళ్లు లేకపోలేదు. ఆ సంగతి పక్కనపెడితే... 331 షేర్లతో.. 2 వేలకు పైగా రియాక్షన్‌లతో ప్రస్తుతానికైతే ఈ పోస్టు దూసుకుపోతుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు