Today Gold and Silver Prices: డాలర్‌ ఢమాల్‌, పసిడి పరుగు

15 Nov, 2023 10:11 IST|Sakshi

దీపావళికి కాస్త దిగి వచ్చి వినియోగదారులను ఊరించిన పసిడి ధర అనూహ్యంగా మళ్లీ పరుగందుకుంది. ముఖ్యంగా అమెరికా ద్రవ్యోల్బణం డేటా విడుదల తరువాత డాలర్ ఇండెక్స్ 10-వారాల కనిష్ట స్థాయికి  పడిపోయింది. నవంబర్ 11, 2022 నుండి అతిపెద్ద సింగిల్-డే క్షీణతకు దారితీసింది. ముఖ్యమైన ఆరు కరెన్సీలతో పోలిస్తే డాలర్‌1.55 శాతం పడి 103.98కి చేరుకుంది. దీంతో బంగారంలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. 

దేశీయంగా
దేశీయంగా నవంబర్ 15న న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,190గా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్‌లో  22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 400  రూపాయలు ఎగిసి  ధర రూ.55,950 వద్ద,  24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ.61,040 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర విషయానికి వస్తే మంగళవారంతో పోలిస్తే బుధవారం హైదరాబాదులో కిలో వెండి ఏకంగా  రూ.1700  పెరిగి రూ.77,700  పలుకుతోంది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.74,700గా ఉంది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్‌తో గడువు ముగిసే గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 10 గ్రాముల ధర స్వల్పంగా  పుంజుకుని రూ. 60,224 ఇంట్రాడే గరిష్ట స్థాయికి చేరుకుంది. స్పాట్ బంగారం ధర ప్రస్తుతం ఔన్స్‌కు1,965 డాలర్లకు పెరిగింది. MCXలో వెండి ధర కిలో   రూ. 71,794 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో, వెండి ధర  ఔన్సు దాదాపు 23 డాలర్లుగా ఉంది.

రూపాయికి బలం
అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ ఏకంగా 600పాయింట్లు ఎగియగా,  నిఫ్టీ 188 పాయింట్లు లాభంతో కొనసాగుతోంది. డాలర్‌ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా లాభాల్లోఉంది. డాలర్‌ బలహీనతతో రూపాయి  0.3 శాతం పెరిగి 83.08 వద్ద ట్రేడవుతోంది, సెప్టెంబర్ 8 నుండి  దాదాపు రెండు నెలల తరువాత ఇదే అత్యధిక లాభం.

మరిన్ని వార్తలు