ఆ ప్రోత్సాహకాలపై సమీక్ష

9 Apr, 2015 01:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగులు సర్వీసులో ఉండగా.. సాధించే విద్యార్హతల ఆధారంగా ఇచ్చే ప్రోత్సాహకాలను సమీక్షించాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ తాజా విద్యార్హతల ఆధారంగా ఇచ్చే ప్రోత్సాహాలను పెద్ద మొత్తంలో పెంచాలని కూడా యోచిస్తోంది. విద్యార్హతలను బట్టి ప్రోత్సాహకాల మొత్తం రూ. 2 వేల నుంచి రూ. 10 వేల వరకూ ఇవ్వాలని భావిస్తోంది.

అయితే ఉద్యోగుల వర్గీకరణ, గ్రేడ్, డిపార్ట్‌మెంట్‌లను బట్టి కాకుండా అందరికీ ఒకే విధంగా ప్రోత్సాహకాలను అందించనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ(డీవోపీటీ) విద్యార్హతల జాబితాలో మార్పు చేర్పులకు సిద్ధమైంది. 16 ఏళ్ల క్రితం నాటి ఈ జాబితాలో తాజాగా కొన్ని విద్యార్హతలను చేర్చి.. మరికొన్నింటిని తొలగించనున్నారు.
 

మరిన్ని వార్తలు