పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

25 Jan, 2020 20:11 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. 2020 సంవత్సరానికి గానూ పద్మ విభూషణ్‌-7, పద్మభూషణ్‌-16, పద్మ శ్రీ- 118 ఇలా మొత్తంగా 141 మంది వివిధ రంగాలకు చెందిన వారు పద్మ పురస్కారాలు దక్కించుకున్నారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. 

దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ.. సాంఘిక, ప్రజా వ్యవహారాలు, విజ్ఞానశాస్త్రం మరియు ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమ, ఔషధం, సాహిత్యం మరియు విద్య, క్రీడలు, పౌర సేవా తదితర రంగాలలో ఈ అవార్డులు లభిస్తాయి. పద్మ విభూషణ్ అసాధారణమైన, ప్రత్యేకమైన సేవకు ప్రదానం చేస్తారు. పద్మభూషణ్ పండిత శ్రీకి, ఏ రంగంలో అయినా ప్రత్యేకమైన సేవ చేసిన వారికీ లభిస్తుంది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా అవార్డులు ప్రకటించబడతాయి. బీజేపీ అగ్ర నేతలైన అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్‌.. మాజీ రక్షణ మంత్రి జార్జ్‌ ఫెర్నాండేజ్‌లకు ప్రజా వ్యవహారాలకు సంబంధించిన రంగంలో ఈ పురస్కారాలు దక్కాయి.

                       విజయ సారథి శ్రీభాష్యం

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బ్యాడ్మింటన్‌ దిగ్గజం పీవీ సింధుకు పద్మభూషణ్‌ పురస్కారం లభించింది. మరో నలుగురు తెలుగు వారిని పద్మ శ్రీ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి.. చిన్నతల వెంకటరెడ్డి (వ్యవసాయం), కరీంనగర్ జిల్లా వాసి, ప్రముఖ సంస్కృత పండితులు, కవి, విమర్శకులు విజయసారథి శ్రీభాష్యం (విద్య). ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎడ్ల గోపాలరావు (కళారంగం), దలవాయి చలపతిరావు( కళారంగం). అదేవిధంగా ఈ ఏడాది వాణిజ్యం, పరిశ్రమలు విభాగంలో ఇద్దరికి పద్మభూషన్‌ పురస్కారాలు లభించాయి. అందులో ఆనంద్‌ మహీంద్రా (మహారాష్ట్ర), వేణు శ్రీనివాసన్‌ (తమిళనాడు). 

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

>
మరిన్ని వార్తలు