భారత గగనతలంలోకి పాక్ విమానం?

30 Aug, 2016 13:31 IST|Sakshi

జమ్మూ: పాకిస్థాన్ విమానమొకటి సోమవారం భారత గగనతలంలోకి వచ్చి, కొన్ని నిమిషాల్లోనే తిరిగి వెళ్లిందని తెలుస్తోంది. జమ్మూలోని ఆర్‌ఎస్ పుర ప్రాంతంలో తక్కువ ఎత్తులో ఎగురుతున్న ఒక విమానం కనిపించిందని బీఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం) చెప్పింది.

ఆరు రెక్కలతో సిల్వర్ రంగులో ఉన్న ఎగిరే వస్తువు మధ్యాహ్నం 1.10 గంటలకు భారత గగనతలంలోకి వచ్చి వెంటనే వెనక్కి వెళ్లినట్లు జవాను ఒక నివేదికను ఢిల్లీలోని బీఎస్‌ఎఫ్ ప్రధాన కార్యాలయానికి పంపారు. ఇందులో నిజమెంతో తెలుసుకోవాలని వాయుసేనను బీఎస్‌ఎఫ్ కోరింది. అనుమానాస్పద విమానం వచ్చిన ట్లు తమ రాడార్స్ గుర్తించలేదని వాయుసేన తెలిపింది.
 

మరిన్ని వార్తలు