పేద, మధ్యతరగతి వారికి ఆమోదయోగ్యం : పియూష్‌ గోయల్‌

5 Jul, 2019 16:55 IST|Sakshi

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రైల్వేలను బలోపేతం చేసేలా ఉందన్నారు కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న పదేళ్లలో రైల్వేలో దాదాపు 50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా బడ్జెట్‌ రూపకల్పన ఉందన్నారు. రైల్వే సమస్యలకు పరిష్కారాన్ని సూచించే విధంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టినందుకు నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బడ్జెట్‌ పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలను పరిష్కరించేలా ఉందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారన్నారు.

పేద, ధనిక తారతమ్యం లేని బడ్జెట్‌ ఇదని.. మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌, ఉద్యోగాల కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారన్నారు.  బడ్జెట్‌ 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందన్నారు. కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ పార్టీ చేస్తోన్న విమర్శల్ని ఆయన కొట్టి పారేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా ప్రవేశ పెట్టిన ఒక్క బడ్జెట్‌ కూడా ప్రజలను మెప్పించలేకపోయిందని మండి పడ్డారు. కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లన్ని గాలిలో మేడలు నిర్మించాయని అందుకే ప్రజలు ఆ పార్టీని నమ్మలేదని పియూష్‌ గోయల్‌ ఆగ్రమం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు