తొలి ప్రధాని నెహ్రూకు ఘన నివాళి

27 May, 2018 11:06 IST|Sakshi
రాహుల్‌ గాంధీ

సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 54వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నివాళి అర్పించారు. ఢిల్లీలోని శాంతి వనంలో నెహ్రూ సమాధి వద్ద రాహుల్‌ గాంధీ పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశ తొలి ప్రధాని పడింట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వర్ధంతి సందర్భంగా నివాళు అర్పిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మన్మోహన్‌ సింగ్‌, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ శాంతి వనంలో నెహ్రూకి నివాళి అర్పించారు.

నెహ్రూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి జాతీయోద్యమంలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. తండ్రి మోతీలాల్‌ నెహ్రూ వారసుడిగా 1929లో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా మొదటిసారి ఎన్నికయ్యారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ తొలి ప్రధానిగా ఎన్నికై దేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం ఏర్పరచడంలో కీలక పాత్ర పోషించారు.

మరిన్ని వార్తలు