రాష్ట్రపతి కూతురు స్వాతి.. ఎయిర్‌హోస్టెస్‌ డ్యూటీ మారింది!

13 Nov, 2017 13:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూతురు స్వాతి ప్రభుత్వ విమానాయాన సంస్థ ఎయిరిండియాలో ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేస్తున్నారు. అయితే, భద్రతా కారణాల రీత్య ఆమెకు తాజాగా కార్యాలయ విధులను ఎయిరిండియా అప్పగించింది. ఇంటిపేరు వినియోగించని స్వాతి ఇన్నాళ్లు ఎయిరిండియాకు చెందిన బోయింగ్‌ 787, బోయింగ్‌ 777 విమానాల్లో క్యాబిన్‌ సిబ్బందిగా పనిచేశారు. అయితే, గత నెల రోజుల నుంచి ఆమెకు ఎయిరిండియా ఇంటిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో విధులు అప్పగించారు.

దీంతో ఎయిర్‌హోస్టెస్‌గా కాకుండా సంస్థ ప్రధాన కార్యాయలంలో ఆమె ప్రస్తుతం పనిచేస్తున్నారని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. 2007లో విలీనమైన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, ఎయిరిండియా ఉద్యోగులకు సంబంధించిన మానవ వనరుల విభాగాన్ని ఇంటిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ పర్యవేక్షిస్తుంది. రాష్ట్రపతి కూతురు కావడంతో ఆమె చుట్టూ భద్రతా సిబ్బంది ఉంటారని, కాబట్టి ఆమె క్యాబిన్‌ క్రూగా కొనసాగించి.. ఆమె చుట్టు ఉన్న భద్రతా సిబ్బందికి విమాన సీట్లు కేటాయించడం వీలుపడదని, అందుకే ఆమె విధులను మార్చినట్టు ఎయిరిండియా వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు