వందేళ్లు నిండినవి 37 వేలు

4 Apr, 2018 18:06 IST|Sakshi

న్యూఢిల్లీ : వందేళ్లు దాటిని రైలు బ్రిడ్జ్‌లు దేశంలో 37వేలు ఉన్నాయని, వీటలో 32శాతం ఉత్తర రైల్వే జోన్‌ పరిధిలోనే ఉన్నట్లు రాష్ట్ర రైళ్లశాఖ మంత్రి రాజెన్‌ గోహెయిన్‌ ప్రకటించారు. మొత్తం 37,162 బ్రిడ్జ్‌ల్లో ఉత్తర రైల్వే జోన్‌లో 8,691, సెంట్రల్‌ జోన్‌లో 4,710, తూర్పు జోన్‌లో 3,119, దక్షిణ సెంట్రల్ జోన్‌లో3,040, పశ్చిమ జోన్‌లో 2,858 బ్రిడ్జ్‌లు ఉన్నట్లు లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు. రాజెన్‌ గోహెయిన్‌ మాట్లాడుతూ  ‘వందేళ్లు పూర్తయినప్పటికి ఈ బ్రిడ్జ్‌లు మంచి స్థితిలోనే ఉన్నాయి. వీటిని పర్యవేక్షించడానికి ఆధునాతన సాంకేతికను వాడుతున్నాం. ప్రతి సంవత్సరం వర్ష కాలనికి ముందు ఒకసారి, తరువాత ఒకసారి పరిక్షిస్తాం. అవసరమయిన చోట ఈ బ్రిడ్జ్‌లకు మరమ్మత్తులు కూడా చేస్తాం.

ఆ సమయంలో రైళ్ల వేగాన్ని తగ్గిస్తాం. గత 5 సంవత్సరాలలో 3,675 బ్రిడ్జ్‌లకు మరమత్తులు చేశారు. ఏప్రిల్‌1, 2017నాటికి 3,017 బ్రిడ్జ్‌ల మరమత్తులకు అనుమతించినట్టు’తెలిపారు. 2017, అక్టోబరులో దేశంలో మరమత్తుల అవసరం వున్న రైలు బ్రిడ్జ్‌లు  సమాచారాన్నిఇవ్వాల్సిందిగా రైల్వేబోర్డు ఆదేశాలు జారీ చేసింది. క్షీణ స్థితిలో ఉన్న 252 బ్రిడ్జ్‌ల మీద రైళ్లు నిత్యం ప్రయాణిస్తున్నాయని, ఇది ప్రమాదకరం అని తెలిపింది. రైలు బ్రిడ్జ్‌లు నాణ్యతకు సంబంధించి మూడు రకాల రేటింగ్‌లను పాటిస్తారు. దీన్ని  ఒవర్‌ ఆల్‌ రేటింగ్‌ (ఓఆర్‌ఎన్‌) 1, 2, 3గా విభజించారు. ఓఆర్‌ఎన్‌ - 1ఉన్న బ్రిడ్జ్‌లకు తక్షణ మరమత్తులు అవసరం. ఓఆర్‌ఎన్‌ - 2 ఉన్న బ్రిడ్జ్‌లను ప్రణాళి ప్రకారం మరమత్తులు చేయాలి. ఓఆర్‌ఎన్‌ - 3 ఉన్న బ్రిడ్జ్‌లకు ప్రత్యేక మరమత్తులు అవసరం ఉన్నట్టు అర్థం.

మరిన్ని వార్తలు