కొత్తగా 5 ఆర్‌ఏఎఫ్‌ కేంద్రాలు

8 Oct, 2018 04:29 IST|Sakshi

న్యూఢిల్లీ: కొత్తగా 5 రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌) కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆర్‌ఏఎఫ్‌ల సంఖ్య 15కు చేరుకోనుంది. ఈ కొత్త కేంద్రాలు వారణాసి (ఉత్తర ప్రదేశ్‌), జైపూర్‌ (రాజస్తాన్‌), మంగళూరు (కర్ణాటక), హజ్‌పూర్‌ (బీహార్‌), నూహ్‌ (హరియాణా)ల్లో ఏర్పాటు చేస్తున్నారు. యూపీలో ఆర్‌ఏఎఫ్‌కు వారణాసి నాలుగో స్థావరం.  మంజూరైన కేంద్రాల పార్లమెంట్‌ నియోజక వర్గాల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీ, హజ్‌పూర్‌ నుంచి కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ప్రాతినిథ్యం వహిస్తుం డటం గమనార్హం. ఆర్‌ఏఎఫ్‌లో ఒక్కో బెటా లియన్‌కు 1000 మంది సైనికులు ఉంటారు.

మరిన్ని వార్తలు