నదుల అనుసంధానికి శ్రీకారం

1 Sep, 2017 14:44 IST|Sakshi
  • రూ. 5.5లక్షల కోట్ల నిధులతో మొదటి దశ
  • మొదటి దశకు అనుమతుల పూర్తి

  • భారత దేశం వర్షాధారిత వ్యవసాయ దేశం. దాదాపు 70 శాతం మంది కేవలం వ్యవసాయం మీద ఆధాపడి జీవిస్తున్నారు. వ్యవసాయానికి అవసనమైన వర్షపాతం కొన్నేళ్లుగా తక్కువగా ఉంటోంది. కాలాలతో సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో వరదలు, తుఫానులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నదులు అనుసంధానం తెర మీదుకు వచ్చింది. ప్రధాని మోదీ డ్రీమ్‌ ప్రాజెక్టుల్లో ఒకటైన రివర్‌ లింకింగ్‌ ప్రాజెక్ట్‌ త్వరలో పట్టాలెక్కనుంది.  

    న్యూఢిల్లీ : దేశంలో కరుపు కాటకాలను, వరదలను నియంత్రించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన నదుల అనుసంధానం త్వరలో పట్టాలెక్కనుంది. ఇందుకు సంబంధించి రివర్‌ లింకింగ్‌ ప్రాజెక్ట్‌ మొదటి దశకు అన్నిరకాల అనుమతులు మంజూరయ్యాయి. త్వరలోనే 5.5 లక్షల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్‌ తొలి అడుగు వేయనుంది.

    మొత్తం 60 నదులు
    దేశవ్యాప్తంగానున్న 60 నదులను రివర్‌ లింకింగ్‌ ప్రాజెక్టులో భాగంగా అనుసంధానం చేయాలన్నది ప్రధాన లక్ష్యం. ఇందులో గంగ, యమున, గోదావరి, కృష్ట సహా చాలా నదులను అనుసంధానం చేస్తారు. దీనివల్ల దేశవ్యాప్తంగా వేల హెక్టార్ల భూమి సాగులోకి రావడంతో పాటు వరదల ప్రమాదాన్ని నివారించుకోవచ్చు.. కరవు కాటకాలను ఎదుర్కోవచ్చు. అంతేకాక వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు.

    అనుమతులు
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నదుల అనుసంధానం మీద ప్రత్యక శ్రద్ధ చూపడంతో రివర్‌ లింకింగ్‌ ప్రాజెక్టు మొదటి దశకు అనుమతులు లభించాయి. నదుల అనుసంధానాన్ని ప్రకృతి, జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నదుల అనుసంధానం వల్ల ప్రకృతి నాశణం అవుతుందని వారు చెబుతున్నారు.

    కెన్‌-బెత్వా ప్రాజెక్ట్‌
    బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో ప్రవహించే కర్నావతి-బెత్వా నదులను రివర్‌ లికింగ్‌లో భాగంగా మొదట అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల క్లియరెన్సులు లభించాయని ప్రాజెక్ట్‌ అధికారులు చెబుతున్నారు. గంగా, గోదావరి, మహానదులను అనుసంధానం చేయడంవల్ల వరదలు, కరువు కాటకాలనుంచి దేశాన్ని రక్షించవచ్చని రివర్‌ లింకింగ్‌ ప్రాజెక్ట్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

    ప్రాజెక్ట్‌ ఏరియా
    కర్నావతి నది మొత్తం 425 కి.మీ. ప్రవహిస్తుంది. లింకింగ్‌ ప్రాజెక్టును టైగర్‌ రిజర్వ్‌ వ్యాలీ అయిన వేదాంత వద్ద నిర్మాంచాలన్నది ప్రాజెక్ట్‌ అధికారులు ఆలోచన. అందుకోసం ఫారెస్ట్‌ రిజర్వ్‌లో 6.5 శాతం భూమిని ప్రభుత్వం ప్రాజెక్ట్‌కు అప్పగించింది. అక్కడ ఆవాసం ఉంటున్న 2 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించినట్లు స్థానిక ప్రభుత్వం చెబుతోంది. మొత్తం మీద అన్ని రకాల క్లియరెన్సులతో మోదీ గ్రీన్‌ సిగ్నల్‌ కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.

    తరువాత ?
    ఈ ప్రాజెక్ట్‌ తరువాత బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌-మహరాష్ట్రలోని నదులను అనుంసంధానం చేయాలన్న ఆలోచన ఉందని రివర్‌ లికింగ్‌ ప్రాజెక్ట్‌ అధికారులు చెబుతున్నారు.

    సమస్యల్లో జంతువులు
    నదులు అనుంసంధానం వల్ల పులులు, రాబందులు, నీటిలో పెరిగే చేపలు ఇతర జంతుజాల మనుగడ ప్రమాదంలో పడుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
     

మరిన్ని వార్తలు