ఢిల్లీని వదిలి వెళ్తాను: గుర్‌మెహర్

28 Feb, 2017 19:27 IST|Sakshi
ఢిల్లీని వదిలి వెళ్తాను: గుర్‌మెహర్

న్యూఢిల్లీ: కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె, ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్‌మెహర్ కౌర్‌ తన ఆందోళనను విరమించాలని నిర్ణయించుకుంది. తనపై బీజేపీ, ఏబీవీపీతో సహా సెల్రబిటీలు కూడా తీవ్రమైన కామెంట్లు చేస్తుండటంతో తన నిరసనను ఇక్కడితే ఆపేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు మద్ధతు తెలిపిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఆందోళన విరమించకపోతే అత్యాచారం చేస్తామంటూ ఏబీవీపీ వారు తనపై బెదిరింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ నుంచి గుర్‌మెహర్ కౌర్ ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకున్నట్లు చెప్పింది. ఈ వివాదంలో గుర్‌మెహర్‌కు అరవింద్ కేజ్రీవాల్ మద్ధతు తెలిపారు.

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్‌మెహర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గత వారం రాంజాస్ కాలేజీలో జరిగిన గొడవలపై చర్చించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ను కలిశారు. రాంజాస్ కాలేజీలో విధ్వసం సృష్టించిన ఏబీవీపీ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంగ్ గవర్నర్‌కు కేజ్రీవాల్ విజ్ఞప్తిచేశారు. గుర్‌మెహర్‌ను బెదిరించిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కేజ్రీవాల్ కోరారు.  గుర్‌మెహర్‌ తండ్రి కెప్టెన్ మణ్‌దీప్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందారు. తన తండ్రిని పాకిస్తాన్ చంపలేదని, యుద్ధం ఆయనను చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మరోసారి ఆమె వివాదంలో చిక్కుకుంది.
 
దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి ఉమర్‌ ఖలిద్‌ను రాంజాస్ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించారు. దీనిపై  గత బుధవారం ఏబీవీపీ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాటు విద్యార్థులు, మీడియాపై దాడికి పాల్పడగా ఈ ఘటనలో దాదాపు 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనపై గుర్‌మెహర్ కౌర్‌ గుర్‌మెహర్‌ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ.. ఏబీవీపీకి భయపడేది లేదంటూ.. తనకు దేశ వ్యాప్తంగా విద్యార్థుల మద్దతు ఉందని రాసున్న ప్లకార్డుతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం మొదలైంది.

రాంజాస్ కాలేజీ వివాదం.. సంబంధిత కథనాలు

ట్విట్టర్‌ వార్‌కు తెరలేపిన సెహ్వాగ్

ఏబీవీపీకి భయపడను: జవాన్‌ కూతురు


'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు'


రాంజాస్‌ కాలేజీలో రణరంగం!


నన్ను రేప్ చేస్తామని బెదిరించారు

 

మరిన్ని వార్తలు