ప్రొఫెసర్ సాయిబాబాకు బెయిల్ మంజూరు

4 Apr, 2016 15:23 IST|Sakshi
ప్రొఫెసర్ సాయిబాబాకు బెయిల్ మంజూరు

ఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ నాగ్ పూర్ జైల్లో ఉన్న ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సోమవారం బెయిల్ లభించింది. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసిన సాయిబాబా గ్రీన్ హంట్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఆరోపణలు రావడంతో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా నాగ్‌పూర్‌లోని సెంట్రల్ జైల్లో 2015 మేలో లొంగిపోయారు.

వికలాంగుడైన సాయిబాబాకు కనీస వసతులను కూడా జైల్లో కల్పించలేదని అతని భార్య ఆరోపించారు. మావోయిస్టు నెపంతో సాయిబాబాను వేధించవద్దని కేంద్రానికి సుప్రీం కోర్టు సూచించింది. ఎట్టకేలకు రాజద్రోహం కేసులో అరెస్టైన సాయిబాబాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదివాసీల హక్కుల కోసం తన భర్త పోరాడుతుంటే మావోలతో సంబంధం అంటగట్టారని సాయిబాబా భార్య అరోపించారు. పెరాలిసిస్తో బాధపడుతున్న ఆయకు కనీస వసతులు కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు