లింగమార్పిడి వారు మాత్రమే థర్డ్ జండర్

30 Jun, 2016 13:38 IST|Sakshi

న్యూఢిల్లీ: థర్డ్ జెండర్పై గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గురువారం థర్డ్ జండర్ అంశంపై విచారణ జరిపిన ధర్మాసనం.. కేవలం లింగమార్పిడి వ్యక్తులు మాత్రమే థర్డ్ జెండర్ పరిధిలోకి వస్తారని మరోసారి స్పష్టం చేసింది. లెస్బియన్లు, గే లు, బైసెక్సువల్ వ్యక్తులు థర్డ్ జెండర్ పరిధిలోకి రారని ఈ సందర్భంగా  మరోసారి  గతంలోని ఆదేశాలను నొక్కి చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్న కోర్టు.. 2014 తీర్పుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.
 

మరిన్ని వార్తలు