వందేభారత్‌ స్నాక్‌ ట్రేలు ధ్వంసం చేస్తున్న పిల్లలు?

23 Nov, 2023 07:39 IST|Sakshi

భారతీయ రైల్వేకు సంబంధించిన ఓ వింత ఘటన బుధవారం వెలుగు చూసింది. రైలులో పరిశుభ్రత లోపించడం, సరిగా లేని ఆహారం తదితర విషయాలపై ప్రతిరోజూ రైల్వే అధికారులకు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తుంటారు. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా రైల్వే అధికారి ఒకరు ప్రయాణికులపై ఆరోపణలు చేశారు.

అనంత్ రూపనగుడి అనే రైల్వే అధికారి ఇద్దరు చిన్నారుల ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వందే భారత్, ఇతర రైళ్లలో స్నాక్ ట్రేలు విరిగిపోవడానికి లేదా పాడైపోవడానికి ఇదే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. 

ఈ ఫోటోలో ఆ పిల్లలు ట్రేపై కూర్చున్నారు. అయితే ఆ ఫోటో సరైనదో కాదో ఇంకా తెలియరాలేదు. ఈ పోస్ట్‌ను లక్ష మందికి పైగా నెటిజన్లు చూశారు. వెయ్యిమందికిపైగా యూజర్లు లైక్ చేశారు. 350 మందికి పైగా యూజర్లు ఈ పోస్టును షేర్ చేశారు. దీనిపై స్పందించిన ఒక యూజర్‌.. ఇలాంటి పిల్లల తల్లిదండ్రుల నుండి జరిమానా వసూలు చేయాలని రాశారు. అయితే రైల్వేశాఖ నుంచి ఈ ఘటనపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇది కూడా చదవండి: మనిషి పాదరక్షలు ఏనాటివి? ఆశ్చర్యపరుస్తున్న పరిశోధనలు!
 

మరిన్ని వార్తలు