కొత్త బెయిల్‌ ప్రతిపాదనకు స్వస్తి

2 Jan, 2017 02:44 IST|Sakshi
కొత్త బెయిల్‌ ప్రతిపాదనకు స్వస్తి

న్యూఢిల్లీ: బెయిల్‌ మంజూరుకు కొన్ని నిబంధనలతో కొత్త చట్టం తీసుకురావాలని ఏడాది క్రితం చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. నేరశిక్షాస్మృతి(సీఆర్‌పీసీ)కి సవరణలు చేస్తే బెయిల్‌ మంజూరులో ప్రతిబంధకాలు తొలగిపోతాయని, కొత్త చట్టం అవసరం లేదని భావిస్తోంది.  ఒక హక్కుగా బెయిల్‌ ఇవ్వాలని, నిందితుడు సాక్ష్యాలను తారుమారుచేసి, మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశముంటేనే నిరాకరించాలని పేర్కొంటూ కొత్త చట్టం తేవాలని న్యాయ కమిషన్ చెప్పింది. ఈ అంశాన్ని పునఃపరిశీలించిన ప్రభుత్వం కొత్త చట్టం అవసరం లేదని నిర్ణయించినట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు