టుడే న్యూస్‌ రౌండప్‌

1 Dec, 2017 18:44 IST|Sakshi

సాక్షి, కర్నూలు : ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని శుక్రవారం ఉపాధి హామీ, వాటర్‌ షెడ్‌ ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలపై వైఎస్‌ జగన్‌నకు వినతిపత్రం ఇచ్చారు. 20 ఏళ్లుగా పని చేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు క్రమబద్దీకరిస్తామని చెప్పి, చంద్రబాబు నాయుడు మోసం చేశారని వారు వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయారు. వారి సమస్యలను ఓపిగ్గా విన్న వైఎస్‌ జగన్‌... వైఎస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

------------------------------------------- రాష్ట్రీయం ---------------------------------------

ఉద్యోగులకు న్యాయం చేస్తాం: వైఎస్‌ జగన్‌
ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని శుక్రవారం ఉపాధి హామీ, వాటర్‌ షెడ్‌ ఉద్యోగులు కలిశారు.

పార్టీ పరువు తీస్తున్నారు: చంద్రబాబు
 ప్రకాశం జిల్లా టీడీపీ నేతల ఘర్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌ అయ్యారు.

వైఎస్సాఆర్‌ సీపీ సీనియర్‌ నేతల భేటీ
వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతల పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యవసర భేటీ అయ్యారు. 

'ఇవాంకకు లేఖ రాశా'
ప్రపంచ పారశ్రామిక వేత్తల సదస్సు కేటీఆర్‌ షో గా నడిచిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావు విమర్శించారు.

'ఆ అర్హత బీజేపీకి లేదు'
 తెలంగాణలో బీసీల సంక్షేమం కోసం రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

------------------------------------------ జాతీయం ------------------------------------------

కమలం ఖాతాలో 14 కార్పొరేషన్లు
యూపీ స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. అత్యధిక కార్పొరేషన్లు, నగర పంచాయితీల్లో ఆ పార్టీ పాగా వేసింది.

మమత పొరపాటుకు టైసన్‌ నవ్వడమా!
 పొరపాటు పడడం ఎవరికైనా సహజమే. సాధారణ పౌరులు పొరపాటు పడితే ఎవరూ పట్టించుకోరు.

ఇక అమిత్‌ షా వంతు!
గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో తెర మీదకు వచ్చిన ‘హిందూ’ వివాదం రోజు రోజుకు ముదురుతోంది.

శబరిమలను కుదిపేస్తున్న ‘ఓక్కి’
 కేరళలో ఓక్కి తుపాను విజృంభిస్తోంది. శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన వేలాదిమంది భక్తులు ఓక్కి తుపాను ధాటికి విలవిల్లాడుతున్నారు. 

---------------------------------- అంతర్జాతీయం ----------------------------------

ట్రంప్‌కు షాకిచ్చిన పుతిన్‌
 ఉత్తర కొరియా విషయంలో అమెరికాకు రష్యా ఊహించన షాక్‌ ఇచ్చింది.

2050 నాటికి ముస్లిం జనాభా.. మూడింతలు
మధ్యప్రాచ్యంలో నెలకొన్న అంతర్గత సంక్షోభాలు.. ఐరాపాను వణికిస్తున్నాయి.

తాలిబన్ల స్వర్గం.. పాకిస్తాన్‌
పాకిస్తాన్‌ ఉగ్రవాదుల స్వర్గమని మరోసారి అమెరికా పేర్కొంది. 

దుమారం.. ఆమె ట్విటర్‌ ఖాతా మాయం
పాకిస్తాన్‌ సైన్యంపై ఆ దేశానికి రాజకీయ మహిళా నేత కుమార్తె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

---------------------------------- సినిమా ---------------------------------------------

మిస్‌ వరల్డ్‌.. మిస్‌ యూనివర్స్‌ వీడియో హల్‌ చల్‌
హరియణాకు చెందిన 20 ఏళ్ల ‘మిస్‌ ఇండియా’  మానుషి ఛిల్లర్‌.. మిస్‌ వరల్డ్‌ 2017 టైటిల్‌ను సాధించి భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పింది.

'అవన్నీ రూమర్స్.. మహేష్ తో సినిమా లేదు'
సూపర్ స్టార్ మహేష్ బాబు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ సినిమా రానున్నట్టుగా కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

'జవాన్' మూవీ రివ్యూ
కెరీర్ స్టార్టింగ్ లో మంచి ఫాంలో కనిపించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్, తరువాత వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో పడ్డాడు. 

యంగ్ హీరో 'షికారు'
పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ సాధించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ, తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించాడు.

------------------------------------ క్రీడలు ------------------------------------------

మానుషి చిల్లర్‌ ప్రశ్నకు కోహ్లి సమాధానం
టీమిండియా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఇటీవల మిస్‌ వరల్డ్‌గా ఎంపికైన మానుషి చిల్లర్‌ ఓ ప్రశ్న వేశారు.

సరిగ్గా 11 ఏళ్ల క్రితం టీమిండియా..
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌ను శాస్తిస్తున్నది టీ 20 క్రికెట్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

'కోహ్లి డిమాండ్‌ సబబే'
భారత క్రికెట్‌ మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని వార్షిక కాంట్రాక్టు ఫీజుతో పాటు తన ఫీజు కూడా పెంచాలని కోరుతూ ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి డిమాండ్‌కు సౌరవ్‌ గంగూలీ మద్దతు పలికాడు.

కుంబ్లే కోసం యుద్ధం చేశా!
గతంలో తాను భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో  ఒకానొక సందర్బంలో అనిల్‌ కుంబ్లే ఎంపిక కోసం సెలక్టర్లతో యుద్దమే చేశానని సౌరవ్‌ గంగూలీ తాజాగా స్పష్టం చేశాడు.

-------------------------------------- బిజినెస్‌ ---------------------------------------------

పెరిగిన ద్రవ్యలోటు
ద్రవ్యలోటు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలానికి బడ్జెట్‌ అంచనాల్లో 96.1 శాతానికి చేరుకున్నట్లు కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) గణాంకాలు వెల్లడించాయి. 

ఎల్‌ఐసీ పాలసీకి ఆధార్‌ లింక్‌ : అలా చేయకండి
 ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మీ ఆధార్‌, పాన్‌ కార్డు వివరాలు, మీ ఎల్‌ఐసీ పాలసీలకు లింక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఐఫోన్లపై అమెజాన్‌ భారీ డిస్కౌంట్లు
ఆపిల్‌ ఫేవరెట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ కొనుగోలు చేయాలని ఎవరైనా చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయమట.

వార్నింగ్‌ : ఆ 42 యాప్స్‌ చాలా డేంజర్‌
స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజ్‌ ఉంది కదా? అని ఎడాపెడా యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేస్తుంటారు కొంతమంది యూజర్లు. 

మరిన్ని వార్తలు