రైలు చార్జీలు పెరగొచ్చు: సదానందగౌడ

15 Jun, 2014 01:33 IST|Sakshi

దొడ్డబళ్లాపురం (కర్ణాటక): ప్రయాణికులకు ఉత్తమ సేవలందించాలనే లక్ష్యంలో భాగంగా రైలు చార్జీలు పెంచినా తప్పులేదని రైల్వే శాఖ మంత్రి డీవీ సదానందగౌడ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సేఫ్టీ, సర్వీస్, సెక్యూరిటీ కోరుకుంటున్న ప్రయాణీకులు.. ఈ చార్జీల పెంపునకు సముఖంగా ఉన్నారన్నారు.

చైనా, జపాన్ దేశాల తరహాలో మన దేశంలోనూ బుల్లెట్ ట్రైన్ సేవలందించే యోచన ఉన్నట్లు తెలిపారు. గత రైల్వే మంత్రి ఖర్గే పలు స్టేషన్లలో రైళ్ల నిలుపుదలను రద్దు చేశారని, అయితే అవి యథావిధిగా నిలిచేలా చర్యలు తీసుకుంటామన్నారు.
 
 

మరిన్ని వార్తలు