300 కిలోల బంగారం.. 24 మంది కమెండోల భద్రత

13 Nov, 2013 17:43 IST|Sakshi
300 కిలోల బంగారం.. 24 మంది కమెండోల భద్రత

బీహార్లోని ప్రసిద్ధ బౌద్ధ పుణ్యక్షేత్రం బుద్ద గయ మహాబోధి ఆలయాన్ని బంగారపు పూతతో మెరుగులు దిద్దనున్నారు. 1500 ఏళ్ల కాలం నాటి ఈ పురాతన ఆలయానికి బంగారపు పూత పనులు ఆరంభమయ్యాయి. ఇందుకోసం 300 కిలోల బంగారాన్ని బుద్ధ గయ పట్టణంలో సిద్ధంగా ఉంచారు. 13 బాక్సుల్లో భద్రపరిచన బంగారుకు 24 మంది థాయ్లాండ్ గార్డులు కాపలా కాస్తున్నారు.

ఈ బంగారాన్ని థాయ్లాండ్కు చెందిన బౌద్ధవులు విరాళంగా ఇచ్చారు. బ్యాంకాక్ నుంచి ప్రత్యేక విమానంలో బుద్ధ గయకు తరలించారు. ఆలయానికి బంగారుతో మెరుగులు దిద్దేందుకు కూడా థాయ్లాండ్ నుంచి 12 మంది నిపుణులను రప్పించారు. 40 నుంచి 50 రోజుల్లోపు బంగారపు పూత పనులు పూర్తవుతాయని ఆలయ మేనేజ్మెంట్ కమిటీ కార్యదర్శి ఎన్.డోర్జీ తెలిపారు. బంగారం భద్రత కోసం ఆలయం లోపల, బయట కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు