రావణుడి కాళ్లు ఎందుకు తిరిగొచ్చాయి?

22 Jun, 2016 11:31 IST|Sakshi
రావణుడి కాళ్లు ఎందుకు తిరిగొచ్చాయి?

రామాయణంలో మనం ఇంతవరకు పెద్దగా వినని అంశాలను కూడా నాయకులు గుర్తుచేస్తున్నారు. లంకలో రామరావణ యుద్ధం జరిగినప్పుడు శ్రీరాముడు రావణాసురుడి చేతులు, కాళ్లు నరికేశాడని, రథం విరగ్గొట్టేశాడని.. కానీ  ఆ తర్వాత కాళ్లు మాత్రం మళ్లీ రప్పించాడని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి అన్నారు. తన కోటలోకి తిరిగి వెళ్లిపోడానికి వీలుగా అలా ఎందుకు చేశాడు అంటూ ట్విట్టర్ జనాలకు ఆయన ఓ ప్రశ్న సంధించారు.

సాధారణంగా ఇంతకాలం తెలిసినదాని ప్రకారం, రావణాసురుడి కడుపులో ఉన్న అమృతభాండాన్ని ఛేదించిన తర్వాత రావణవధ జరిగిందంటారు. ఆ రహస్యాన్ని కూడా విభీషణుడు రాముడి చెవిలో వేసిన తర్వాతే రావణాసురుడు నేలకొరిగాడని చెబుతారు. కానీ సుబ్రమణ్యం స్వామి మాత్రం సరికొత్త అంశాలను చెబుతున్నారు.

మరిన్ని వార్తలు