తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన ప్రకాశ్‌రాజ్‌

3 Oct, 2017 13:36 IST|Sakshi

బెంగళూరు: జాతీయ అవార్డులను వెనక్కి ఇవ్వబోనని బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్‌ స్పష్టం చేశారు. ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్యపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందికపోవడాన్ని నిరసిస్తూ జాతీయ అవార్డులను వెనక్కు ఇచ్చేస్తానని ఆయన అన్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ... ‘నా ప్రతిభ, కష్టార్జితానికి గుర్తింపుగా దక్కిన జాతీయ అవార్డులను వెనక్కి ఇవ్వను. నేను అవార్డులు వాపస్‌ చేయనున్నానని వచ్చిన వార్తలు నిరాధారం. ఇలాంటి నాకు ఆలోచన లేద’ని అన్నారు. ఈ మేరకు ఒక వీడియోను తన ట్విటర్‌ పేజీలో పెట్టారు.

గౌరి లంకేష్‌ హత్యను ఖండించిన వారిపై సోషల్‌ మీడియాలో దూషణలకు దిగినవారిని ప్రధాని మోదీ ఏమీ అనకపోవడం పట్ల ప్రకాశ్‌ రాజ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఇంత జుగుప్సకరమైన భాషను నా జీవితంలో ఎప్పుడూ వినలేదు. ప్రధాని మోదీ అనుచరులు ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో నన్ను దారుణంగా తిట్టారు. అయినా ప్రధాని నోరు మెదపలేదు. గౌరీ లంకేష్‌ లాంటి జర్నలిస్ట్‌ దారుణ హత్యకు గురైతే ప్రధాని ఇప్పటివరకు స్పందించలేదు. ఈ విషయమే నన్ను బాధ పెడుతోందని అన్నాను తప్పా అవార్డులు వెనక్కు ఇచ్చేస్తానని చెప్పలేద’ని అన్నారు.

>
మరిన్ని వార్తలు