డబ్ల్యూటీఓలో తొలగిన ప్రతిష్టంభన

14 Nov, 2014 03:02 IST|Sakshi
డబ్ల్యూటీఓలో తొలగిన ప్రతిష్టంభన
  • ‘ఆహార భద్రత’పై భారత్ - అమెరికా ఒప్పందం
  • న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత్ ‘ఆహార భద్రత’ పథకాన్ని అమలు చేసే విషయంలో అవరోధంగా ఉన్న ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను సడలించే దిశగా.. అమెరికా - భారత్‌ల మధ్య కీలక ఒప్పందం ఖరారైంది. డబ్ల్యూటీఓ నిబంధనల్లో.. ఆయా దేశాలు తమ దేశ పేదలకు ఆహార సబ్సిడీని అందించేందుకు ఉద్దేశించిన ‘శాంతి నిబంధన’ను ఈ అంశానికి డబ్ల్యూటీఓ శాశ్వత పరిష్కారం కొనుగొనేవరకూ అమలుచేయాలని రెండు దేశాలూ అంగీకారానికి వచ్చా యి. దీంతో.. డబ్ల్యూటీఓ వాణిజ్య సౌలభ్య ఒప్పందంపై ప్రతిష్టంభన తొలగిపోయి అమలుకు మార్గం సుగమమైందని భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ గురువారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు.

    డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకా రం.. ఏదైనా అభివృద్ధి చెందుతున్న దేశం తన ప్రజలకు అందించే ఆహార సబ్సిడీ.. మొత్తం దేశ వ్యవసాయ ఉత్పత్తిలో 10 శాతానికి మించరాదు. ఆ పరిమితిని మించినట్లయితే ఆంక్షలు తదితర చర్యలు ఉంటాయి. డబ్ల్యూటీఓ సభ్య దేశాలు తమ ప్రజలకు అవసరమైన ఆహార సబ్సిడీని అందించేందుకు చట్టబద్ధమైన భధ్రత కల్పించే ‘శాంతి నిబంధన’ ఉంది. బాలీ ఒప్పందం ప్రకారం ఈ నిబంధన 2017వరకే అమలులో ఉంటుంది.

    ఈ గడువు మూడేళ్లలోనే ముగిసిపోతే భారత్‌అమలు చేస్తున్న ఆహార భద్రత పథకానికి ఇబ్బందులు ఎదురవచ్చు. దీంతో.. గత జూలైలో బాలిలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అప్పటి నుంచీ డబ్ల్యూటీఓ ఒప్పం దంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా, భారత్‌ల మధ్య ఒప్పందం కుదిరింది.
     

మరిన్ని వార్తలు