యోగా.. ‘మత విశ్వాసానికి విరుద్ధం’

6 Apr, 2018 14:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కొట్టాయం : యోగ, క్రైస్తవ మతాచారాలు రెండు వేర్వేరని కేరళలోని సైరో మలబార్‌ చర్చ్‌ ప్రకటించింది. యోగా ఏకత్వాన్ని విశ్వసిస్తుందని, కానీ క్రైస్తవ మత విశ్వాసాలు సృష్టికర్తకు, సృష్టింపబడినవారు మధ్య తేడా ఉంటుందని విశ్వసిస్తుంది. యోగాను వ్యాయామంగా మాత్రమే చూడవచ్చు తప్ప యోగా సాధన వల్ల భగవంతుడిని చేరుకోలేమని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేయడంతో ఈ విషయం గురించి మతసంస్థలు ఏమనుకుంటాన్నాయో విచారించడానికి సైరో మలబార్‌ చర్చ్‌ ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం యోగా క్రైస్తవ విశ్వాసాలకు పూర్తిగా విరుద్ధం అని తెలిపింది. యోగా వల్ల ఆరోగ్యం పరంగా లాభాలు ఉంటాయి కానీ దేవుడిని చేరడానికి మార్గం చూపదు అన్నారు.

యోగా ద్వారా ఎటువంటి ఆధ్యాత్మికతను పొందలేము, అలానే యోగాలోని కొన్ని భంగిమలు కూడా క్రైస్తవ మతాచారాలకు విరుద్ధంగా ఉంటాయి అని కమిషన్‌ విడుదల చేసిన రికార్డులో వెల్లడించింది. సంఘ్‌ పరివార్‌ తన హిందూత్వ ఎజెండాను, హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలను చూస్తే ఆశ్చర్యంగా ఉంది. దానికి తగ్గట్టుగానే భారత ప్రభుత్వం కూడా పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేయడం, యోగాను భారతీయ సంస్కృతిలో చాలా ముఖ్యమైన అంశంగా మార్చడానికి కూడా ప్రయత్నిస్తుండటంతో ఇప్పుడు ఈ అంశం గురించి పరిశీలించవలసి వచ్చింది అని చర్చి అధికారులు అన్నారు. కేరళలోని సైరో మలబార్‌ చర్చ కాథలిక్‌ చర్చ్‌. దీనిపై పూర్తి అధికారం పోప్‌కే ఉంటుంది. వీటి కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు