బతుకమ్మ సంబరాలకు సిద్ధమవుతున్న సింగపూర్‌

11 Oct, 2018 15:39 IST|Sakshi
బతుకమ్మ వేడుకలకు సంబంధించి ఆహ్వాన లేఖలని ఫోన్లలో చూపిస్తున్న టీసీఎస్‌ఎస్ సభ్యులు

సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో అక్టోబర్ 13న సింగపూర్‌లోని సంబవాంగ్ పార్క్‌లో బతుకమ్మ పండుగ సంబరాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంబరాల్లో, ఉత్తమ బతుకమ్మలకు, ఉత్తమ సాంప్రదాయ వేషధారణలో వచ్చిన చిన్నారులకు ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయని, గ్రాండ్ లక్కీ డ్రాలో అదృష్ట విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకలకు చేయూత, సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి టీసీఎస్‌ఎస్ కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 

ప్రతీ సంవత్సరం మాదిరిగానే సంబరాల్లో పాల్గొనే వారందరికి సరిపడే ఆహారం, ఇతర ఏర్పాట్లు చేశామన్నారు. ఈ బతుకమ్మ పండుగకు ప్రవేశం ఉచితమని, సింగపూర్‌లోని తెలుగువారే కాకుండా మిగతా రాష్ట్రాలకుచెందినవారు పెద్ద ఎత్తున రావాలని టీసీఎస్‌ఎస్ కోరింది.

ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి అహర్నిశలు కష్టపడుతువారికి, దాతలకు టీసీఎస్‌ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ఉపాధ్యక్షులు గడప రమేష్ బాబు, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, సంస్థాగత కార్యదర్శి చేన్నోజ్వాల ప్రవీణ్, ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, గోనె నరేందర్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, జింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు అనుపురం శ్రీనివాస్, నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, రాము బొండుగుల, నంగునూరి వెంకట రమణ, శ్రీధర్ కొల్లూరి, కల్వ రాజులతోపాటూ పలువురికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల కరపత్రాలని టీసీఎస్‌ఎస్ సభ్యులు విడుదల చేశారు.

మరిన్ని వార్తలు