ప్రముఖ ఎన్నారై నటుడు పాల్ గౌతమ్ మృతి

18 Jul, 2013 16:51 IST|Sakshi

ఇటీవలే అదృశ్యమైన ప్రముఖ ఎన్నారై నటుడు పాల్ గౌతమ్ భట్టాచార్జీ మృతి చెందాడని బ్రిటన్ మెట్రోపాలిటన్ పోలీసులు గురువారం వెల్లడించారు. అతని మృతదేహన్ని దక్షిణ ఇంగ్లాండ్లోని తూర్పు సుసెక్స్ వద్ద కనుగొన్నట్లు తెలిపారు. అయితే పాల్ అనుమానాస్పద రీతిలో మరణించలేదని తాము భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన లండన్లోని స్లొయని స్క్వేర్లోని రాయల్ కోర్ట్ థియేటర్ పాల్ గౌతమ్ రిహార్సిల్స్ చేశారు. అనంతరం ఆయన కనిపించకుండా పోయారు. కానీ10వ తేదీ రాత్రి తన స్నేహితురాలికి ఇక నుంచి తాను కనిపించనని ఫోన్ ద్వారా పాల్ భట్టాచార్జీ సందేశం ఇచ్చారు.

 

పాల్ ఆదృశ్యంపై రాయల్ కోర్ట్ థియేటర్ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పాల్కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆ థియేటర్ ప్రతినిధి పోలీసులకు అందించారు. దాంతో పోలీసులు తూర్పు సుసెక్స్ వద్ద కనుగొన్న మృతదేహానికి పాల్కు దగ్గరగా అనవాళ్లు ఉన్నాయి. దాంతో పాల్ మరణించినట్లు బ్రిటన్ పోలీసులు దృవీకరించారు.

 

'పాల్ ద బెస్ట్ ఎక్సోటిక్ మారీగోల్డ్ హోటల్', 'వైట్ టీత్', 'డర్టీ ప్రెట్టీ థింగ్స్' తదితర చిత్రాల్లో నటించారు. అయితే ఈ వారంలో జరగనున్న |బ్లాక్ కామిడీ షో|కు పాల్ హాజరుకావలసి ఉంది. 2006లో విడుదలైన జేమ్స్ బాండ్ నటించిన క్యాసినో రాయల్ చిత్రంలో పాల్ భట్టాచార్జీ వైద్యుని పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు