సింగపూర్​లో ఘనంగా పీవీ శత జయంతి వేడుకలు

1 Jul, 2020 16:25 IST|Sakshi

కౌలాలంపూర్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను సింగపూర్​ ఎన్నారై టీఆర్ఎస్​ ఆధ్వర్యంలో సింగపూర్​లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి వెంకట రమణారెడ్డి, బైర్నేని రావు రంజిత్​ మాట్లాడుతూ బహుభాషావేత్త, రచయిత, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన పీవీ నరసింహారావు సేవలను గుర్తుచేసుకున్నారు. కుంటుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని కొనియాడారు. దేశానికి ఎనలేని సేవ చేసిన పీవీని భారతరత్నతో గౌరవించాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల మద్దతిస్తామని చెప్పారు.

ఆరేళ్లుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్న సీఎం కె.చంద్రశేఖర్ రావుకి సింగపూర్​ ఎన్నారై తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లాల మురళి మోహన్ రెడ్డి, మాచాడి రవీందర్ రావు, వీరమల్ల క్రిష్ణ ప్రసాద్, బద్దం జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా