జర్మనీలో ఘనంగా ఉగాది వేడుకలు

28 Mar, 2018 19:49 IST|Sakshi

ఫ్రాంక్‌ఫర్ట్‌, జర్మనీ : నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ వేడుకలు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో ఘనంగా నిర్వహించారు. జర్మనీ తెలుగు వెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోస్సెన్ హైం ఆడిటోరియంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్ ఎంబసీ కాన్సులేట్ జనరల్ ప్రతిభ పార్కర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఫ్రాంక్‌ఫర్ట్‌ నగర పురపాలక ప్రతినిధి మోబిస్ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగువెలుగు సంస్థ కమిటీని, వారు చేసే వివిధ సాంస్కృతిక సేవలను కొనియాడారు. 

గాయకులు ధనుంజయ్, సాయి శిల్పలు వారి ప్రదర్శనలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. భూషణ సాయి హేమంత్ కృష్ణ తన నాసికా వేణుగానంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. నదియా నృత్య ప్రదర్శన తో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇండియన్ మ్యూజిక్ అకాడమీ, ఇండియన్ డాన్స్ అకాడమీ, ఉజ్వల డాన్స్ గ్రూప్, ఫ్రాంక్‌ఫర్ట్ గర్ల్స్ ఎంతో ఉత్సాహంగా వారి కళలను ప్రదర్శించారు. 

కార్యక్రమానికి వచ్చిన అతిథులకు రుచి రెస్టారెంట్ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసింది. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన రుచి రెస్టారెంట్, ఎయిర్ ఇండియా, హెక్స్‌డ్ సాఫ్ట్‌వేర్, జవాజి సాఫ్ట్‌వేర్‌, జస్ట్ 1 బజార్, స్పూన్స్ అండ్ ఫోక్స్, వాట్సమన్ కన్సల్టింగ్, పిజె ఈవెంట్స్ వారికి సంస్థ అధ్యక్షుల సాయి రెడ్డి  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు