టెక్సాస్‌లో ఘనంగా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు

23 Dec, 2018 00:18 IST|Sakshi

ఆస్టిన్ (టెక్సాస్): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు అమెరికా టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, నాయకులు, జననేత అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ.. దివంగత మహానేత ఆశయ సాధనకై కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. జననేత నాయకత్వం కోసం ఏపీ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని తెలిపారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదని మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఇంకా వారు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ వ్యక్తి కాదని, ఓ శక్తి అని.. వంద మంది చంద్రబాబులు వచ్చిన ఆయనను ఆపే శక్తి వారికి లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఏకమై చంద్రబాబు సైకిల్‌కు పంక్చర్‌ చేసి ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. ఏపీలో నేడు రైతులను మరిచి, అధికార గర్వంతో అభివృద్ధిని తుంగలో తొక్కి, అవినీతిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్న అధికార టీడీపీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలన్నారు. ప్రజా సంక్షేమం మరిచిన టీడీపీని భూస్థాపితం చేయాలని కోరారు. అందుకు వైఎస్సార్‌ సీపీ అమెరికా విభాగం నడుం బిగించి తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ సీపీ గెలుపు కోసం కృషి చేయడానికి త్వరలోనే తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని, మహానేత వైఎస్సార్‌ బాటలో నడుస్తూ ప్రజాహితం కోసం సర్వదా పాటుపడతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి ఎదురు, పరమేశ్వర రెడ్డి నంగి,మల్లికార్జున రెడ్డి ఆవుల, రామ హనుమంత రెడ్డి , సంగమేశ్వర్ రెడ్డిగారి, అశోక్ గూడూరు, వసంత్ రెడ్డి ఉయ్యురు, దుశ్యంత్ రెడ్డి , గురుచంద్రహాస్ రెడ్డి , సుబ్బారెడ్డి ఎర్రగుడి, వెంకట రెడ్డి కొండా, యస్వంత్ రెడ్డి గట్టికుప్పల, శ్రీకాంత్ రెడ్డి ఐనాల, వెంకట్ కొట్టే, రవి, శివ శంకర్ వంకదారు, శ్రీకాంత్ రెడ్డి, చెన్నా రెడ్డి , ప్రవీణ్ కర్నాటి, అరుణ్ , అనిల్ కడిపికొండలతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. వారంతా వీడియో, టెలీకాన్ఫెరెన్స్ ద్వారా జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


 

మరిన్ని వార్తలు